ఈనెల 21 నుంచి వర్షాలు.. వాతావరణ శాఖ గుడ్ న్యూస్

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఉదయం నుంచే ఎండలు మండి పోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఈ నెల 21వ తేదీ నుండి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు , ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది.

ప్రజలు వేసవి ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెగాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

తీవ్ర వేడి ప్రభావంతోపాటు వడగాలులు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడగాలుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రానున్న రెండు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

 

 

Exit mobile version