
చండూరు, క్రైమ్ మిర్రర్
టీయూడబ్ల్యూజే ( హెచ్ – 143 ) సంఘం చండూరు మండల నూతన కమిటీని ఆ సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డు సతీష్ గౌడ్ అధ్యక్షతన చండూరు మండల కేంద్రంలోని స్థానిక సాయి దుర్గా కాంప్లెక్స్ లో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు గా బోయపల్లి రమేష్ గౌడ్ ( దిశ ), ప్రధాన కార్యదర్శి గా ఆడెపు పరమేశ్ ( మహా న్యూస్ ), ఉపాధ్యక్షుడు గా చినపాక శ్రీను ( రాజ్ న్యూస్ ) లను సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యూనియన్ ఆదేశాల మేరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కాగా పూర్తి స్థాయి కమిటీని అతి త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని సంఘం నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డు సతీష్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ తండు. సాగర్ గౌడ్ ( క్రైం మిర్రర్ ), వరికుప్పల సురేష్( నమస్తే తెలంగాణ ), కురుపాటి శ్రవణ్ కుమార్( 10 టీవీ ), పిట్టల రాంబాబు ( టీ న్యూస్ ), కొత్త గంగాధర్ గౌడ్ ( 6 టీవీ ), వి. భగవంతం ( బీ ఆర్ కే న్యూస్ ), వెంకన్న ( 99 టీవీ ), కళ్ళెం సురేందర్ రెడ్డి ( మీ న్యూస్ ), అబ్బనబోయిన రవి ( ప్రజా జ్యోతి ), గంజి రాము ( తారక ), ఇరిగి సుధాకర్ ( ప్రజా ప్రతిభ ), సంకబుడ్డి శంకర్( సత్యనిష్ట ), అన్నెపర్తి మల్లేష్ ( మనం ), మొగుదాల శేఖర్ గౌడ్ ( మెట్రో 6 ), కల్లెట్ల శంకర్( ప్రజా సాక్షి ) తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ – పెద్దిరెడ్డి ఫ్యామిలీకి అరెస్ట్ భయం..!
హైదరాబాద్‌లో ఉగ్రవాదులు – పేలుళ్లకు ప్లాన్ – ఆ తర్వాత ఏమైందంటే..?