
– స్థానిక ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్న బీజేపి
– మండల కార్యవర్గంతో మంథనిలో కదలికలు
– మండల కార్యవర్గ ఎన్నికతో కార్యకర్తల్లో నూతనోత్సాహం
క్రైమ్ మిర్రర్, మహదేవ్ పూర్ :- స్థానిక ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. అది కూడా అలా ఇలా కాదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చూపాలి, ఉనికి చాటుకోవాల్సిందేనన్నట్టుగా ఉంది బీజేపీ వ్యవహారం. అందులో భాగంగానే.. నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి కార్యవర్గ చరణ కార్యచరణ మొదలుపెట్టింది. మండల ఇన్చార్జ్‌లు, కన్వీనర్స్ నియామకాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. అయితే.. ఇన్ఛార్జ్‌లు, కన్వీనర్స్ లోకల్‌బాడీస్ ఎలక్షన్స్‌లో పోటీ చేయరు. కేవలం ఎన్నికల సమన్వయం కోసం పని చేస్తారు. టాప్ టు బాటమ్ ఇలా జరుగుతున్న కసరత్తు చూస్తుంటే.. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాషాయ పార్టీ ఎంత సీరియస్‌గా ఉందో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు.ఇదే క్రమంలో కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన ఐదు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.
Read also : గ్రామాన్నే శోక సంద్రంలోకి ముంచేసిన ఘటన.. ఆరుగురు చిన్నారులు మృతి!
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, చల్ల నారాయణ రెడ్డి హాజరై మహాదేవపూర్ మండల్ బీజేపీ నూతన కార్యవర్గని ప్రకటించారు. ఈ నూతన కార్యవర్గంలో మండల అధ్యక్షులుగా రాంశెట్టి మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా అంకరి రాజేందర్, సూరం మహేష్, శనిగరం కిష్టయ్య, ఆకుల మధుకర్, మండల ప్రధాన కార్యదర్శులు గుజ్జుల శంకర్, బొల్లం కిషన్, లింగంపల్లి వంశీ, బల్ల శ్రావణ్ కుమార్, కార్యదర్శులు బంధుగుల సంతోష్, గోరె శ్రీకాంత్, ఏమ్ఆర్ యాదవ్, శ్యామల ప్రశాంత్, కోశాధికారిగా ఉదారి పూర్ణచందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు ఓడేటి బాలిరెడ్డి, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు సాగర్ల రవీందర్,ఎస్సి మోర్చ మండల అధ్యక్షులు బూడే శేఖర్, ఎస్టీ మోర్చ మండల అధ్యక్షులు దుగ్యాల రాము లను నియమించడం జరిగింది, అనంతరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డీ మాట్లాడుతూ నూతన కార్యవర్గనికి శుభాకాంక్షలు తెలిపి, ప్రతీ ఒక్కరు కూడా బీజేపీ బలోపేతానికి కృషి చెయ్యాలని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ కోసం ప్రతీ ఒక్కరు కష్టపడాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో మహాదేవపూర్, మహాముత్తరాం, మలహార్ మండలాల అధ్యక్షులు,రాంశెట్టి మనోజ్ కుమార్, పూర్ణ చందర్, శ్రీకాంత్, దుర్గం తిరుపతి, బండం మల్లారెడ్డి, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read also : ప్రజాపాలనలో అర్హులకు అన్యాయం జరగదు : కె ఎల్ ఆర్