
హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీళ్లు నిండిన బకెట్లో పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సూరారం పోలీసు స్టేషన్ పరిధిలోని పాండు బస్తీలో చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన పప్పు రవిదాస్ (45) కూలీ పనులు చేస్తూ పాండు బస్తీలో నివసిస్తున్నాడు. చిన్నారి తల్లి బిహార్‌లో ఉండటంతో, తండ్రి వద్దే ఉంటున్న చిన్నారిని మరో కుమార్తె చాందిని కుమారి (10) చూసుకుంటోంది. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం సుమారు 4 గంటలకు తన అక్క చాందిని వాష్‌రూమ్‌కు వెళ్లి బయటకు వచ్చి, బకెట్లో పడిన తన చెల్లిని చూసి కేకలు వేసింది. ఈ క్రమంలో చిన్నారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సూరారం పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ – 194 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడ చదవండి:
- రాజీవ్ చౌక్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. నేటి నుంచి 3 రోజుల పాటు కల్వర్టు నిర్మాణ పనులు: మున్సిపల్ కమిషనర్
-
ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం…! ఊపిరి పీల్చుకున్న ప్రయాణీకులు..
-
గడ్డపోతారం ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్ర్బాంతి…! మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి…
-
ఇషాన్‌కిషన్‌కు గాయం…! రెండో టీ20కి దూరం…