ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత తలెత్తింది. అటవీ అధికారుల మీద దాడి చేశారు గ్రామస్థులు. ఈ ఘటనతో ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు అటవీ అధికారులు. కార్డెన్ సెర్చ్ లో పలు ఇళ్లకలప దుంగలు, ఫర్నిచర్ దొరికింది. కలప దుంగలు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో అటవీ అధికారులపై దాడి చేశారు గ్రామస్థులు.
జాధవ్ నౌశిలాల్ అనే బీట్ ఆఫీసర్ పై గ్రామస్తులు దాడి చేయడంతో అతనికి గాయాలయ్యాయి. అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనం పై దాడి చేసి అద్దాలు పగలకొట్టారు గ్రామస్థులు. కేశవపట్నం గ్రామానికి చేరుకున్న పోలీసు బలగాలు, గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. దాడి విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు అటవీ అధికారులు