
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఇంటర్ విద్యార్థుల పరీక్షల రిజల్ట్స్ విడుదల కాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రేపు అనగా 12వ తేదీ శనివారం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు రిలీజ్ అవుతాయని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు విడుదల కానున్నాయి. కాబట్టి ఫలితాలను https://resultsbue.ap.gov.in వెబ్సైట్లు చూసుకోవచ్చని నారా లోకేష్ తెలిపారు. కాబట్టి ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు ఎవరు ఒత్తిడికి గురవద్దని నారా లోకే సూచించారు. ఫలితాలు అనేవి కేవలం విద్యకు సంబంధించినవి మాత్రమే అని, కాబట్టి ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరూ కూడా ఆత్మహత్యలు లాంటివి చేసుకోవద్దని సూచించారు.
కాగా ప్రతి సంవత్సరం కూడా 10వ తరగతి లేదా ఇంటర్ విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదల కాగానే చాలామంది పాసుగాని విద్యార్థులు అలాగే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు పంతానికి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎన్నో మరణాలు సంభవించిన సంఘటనలు మనం చాలానే చూసుంటాం. కాబట్టి విద్యార్థులందరూ ఎటువంటి తప్పిదాలు చేయకూడదు అని సూచించారు.
జగన్ భార్యపై దారుణమైన కామెంట్స్ చేసిన కిరణ్… చివరికి అరెస్ట్?
పెట్రోల్ బంక్ ల్లో ‘నో స్టాక్’ పరిస్థితి రావద్దు..:- మాచన రఘునందన్