
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడుతోంది. ఈ అల్పపీడనం ఈ నెల 26 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారిపోతోంది.
సమగ్ర ముందస్తు సమాచారం ప్రకారం, రాష్ట్రంలో రాబోయే సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మంగళవారం, బుధవారాల్లో అనేక జిల్లాల్లో భారీ నుండి అత్యంత అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, ప్రజలు, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా సహాయం కావాల్సిన సందర్భాలలో సంప్రదించేందుకు SDMA ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది:
112
1070
18004250101
ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, స్థానిక అధికారుల సూచనలు పాటించి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.