
తూర్పుగోదావరి, క్రైమ్మిర్రర్: పెద్దపులి తూర్పుగోదావరి జిల్లాలో హడలెత్తిస్తుంది. దీంతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు రాత్రి వేళ్లలో బయటకు వెళ్లవద్దని, ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. చాగల్లు మండలంలోని చిక్కాలపాలెం, అమ్మిగుంట ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో అటవి అధికారులు అప్రమత్తమయ్యారు. చిక్కాలపాలెం సమీపంలో పెద్దపులిని గమనించిన స్థానికులు దానిని వెంబడించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. గత ఐదు రోజులుగా పులి ఎలాంటి వేటాడకపోవడంతో ఆహారం దొరకక నీరసించినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. పులి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు.. దాని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
పెద్దపులి ప్రస్తుతం నీరసంగా ఉన్నట్లు భావిస్తున్న నేపథ్యంలో దానిని సురక్షితంగా బంధించేందుకు ఇదే అనువైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పులి కదలికలను గుర్తించడం.. దాని సంచార మార్గాలను పరిశీలించడం వంటి చర్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా పొలాల వద్దకు వెళ్లే రైతులు.. వ్యవసాయ పనుల కోసం బయటకు వెళ్లే కూలీలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, పులి కనిపించినా దాని దగ్గరకు వెళ్లడం, వెంబడించడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని బంధించే వరకు స్థానికులు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు.
ఇవి కూడ చదవండి:
-
పెళ్లయిన 12 గంటలకే వరుడు మృతి.. మామిడి తోటలో చెట్టుకు వేలాడుతూ మృతదేహం!
-
ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదని రైలు కింద పడి యువ జంట మృతి!
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 45 రోజుల పసికందు మృతి!
-
రంగారెడ్డి జిల్లాలో విషాదం.. లిఫ్ట్ కింద పడి కార్మికుడు మృతి