
స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. నెక్కొండ మండలం పిట్టకాలుబోడు తండాకు చెందిన రాహుల్ అనే బాలుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. స్కూల్ బస్సు వద్ద జరిగిన ప్రమాదంలో రాహుల్ బస్సు కింద పడిపోయాడు. ఆ సమయంలో బస్సు టైర్లు బాలుడి తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.
ప్రమాదాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారి మృతితో కుటుంబంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.
also read: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి