తెలంగాణ

ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద హుండీ మాదిరి వసూళ్ల దందా – ఏసీబీ దాడుల్లో వెలుగు చూసిన నిజాలు

హైదరాబాద్, క్రైమ్ మిర్రర్:-తెలంగాణలో రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) చెక్‌పోస్టులు అవినీతి హాట్‌స్పాట్లుగా మారినట్టు ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో స్పష్టమైంది. చెక్‌పోస్టుల వద్ద హుండీ మాదిరిగా పెట్టిన డబ్బా(బాక్స్)లలో లారీ డ్రైవర్లు నోట్లను వేస్తున్న దృశ్యాలు ఏసీబీకి చిక్కాయి.

తాజా తనిఖీల్లో ఒక్కో చెక్‌పోస్ట్ వద్ద రోజుకు కనీసం రూ.2.5 లక్షలకుపైగా అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. వాహనాలపై ఎక్కువ లోడ్, పత్రాల లోపాలు మొదలైన వాటిని కవర్ చేయడానికి డబ్బు తీసుకుంటున్న ఆర్టీఏ సిబ్బంది, స్థానిక ఏజెంట్లను ఉపయోగించి వసూలు చేస్తున్నారు. ఒక్కో ఏజెంట్‌కు రోజుకు సుమారుగా రూ.8,000 వరకు కమీషన్ అందుతోంది. ఇంకా, ఈ చెక్‌పోస్టుల వద్ద అధికార సిబ్బంది, ఏజెంట్లతో కలిసి ఈ వ్యవహారాన్ని సిస్టమాటిక్‌గా నడుపుతూ, భారీ మొత్తంలో కిక్‌బ్యాక్‌లు సొంతం చేసుకుంటున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు.

అవినీతి బాగోతంపై పూర్తి స్థాయిలో రిపోర్టు సిద్ధం చేసి, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. దీని ఆధారంగా ఆర్టీఏ కార్యాలయాల అవినీతిపై, చెక్‌పోస్టుల విధానంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

తగ్గిన బంగారం, వెండి ధరలు, ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?

తెలంగాణలో వర్షాలు.. ఎక్కడెక్కడ కురుస్తాయంటే?

Back to top button