
హైదరాబాద్, క్రైమ్మిర్రర్: సినిమా సెలబ్రిటీలు బయటకు వెళ్లినప్పుడు అభిమానులు ఫొటోలు దిగాలనుకోవడం సహజం కాని అభిమానం పేరుతో హద్దులు దాటం వారి వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించడం ఆందోళన రేపుతోంది. తాజాగా స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు ఎయిర్పోర్టులో తనకు జరిగిన చేతు అనుభవం స్పందించారు.
ఒకసారి ఎయిర్పోర్టులో తన లగేజీ కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు తన దగ్గరకు వచ్చారని అనుపమ తెలిపింది. తొలుత మాట్లాడేందుకు ప్రయత్నించిన వారు, ఆ తర్వాత తన అనుమతి లేకుండానే ఫొటోలు తీయడం ప్రారంభించారని చెప్పింది. తాను ఒంటరిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కొందరు చుట్టుముట్టి ఫొటోలు తీస్తూ, తాకుతూ ప్రవర్తించడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఎదురైందని వివరించింది. ఆ సమయంలో తనకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, ఈ ఘటన మానసికంగా తనపై ప్రభావం చూపిందని అనుపమ పేర్కొంది. అభిమానులతో ఫొటోలు దిగడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అనుపమ స్పష్టం చేసింది. అయితే ఫొటోలు తీసుకునే సమయంలో కొందరు ప్రవర్తించే తీరు తనను ఆందోళనకు గురిచేస్తుందని చెప్పింది. ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తారో, అనుమతి లేకుండా ఎక్కడ తాకుతారో అనే భయం ఉంటుందని వెల్లడించింది.
ఒక సెలబ్రిటీగా అభిమానులతో కలవడం, వారితో ఫొటోలు దిగడం తన వృత్తిలో భాగమే అయినప్పటికీ, అందుకు కొన్ని పరిమితులు ఉండాలని ఆమె అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశాల్లో సెలబ్రిటీలను చూసినప్పుడు ఫొటోలు తీసుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తుంది. అయితే వారి అనుమతి లేకుండా ఫొటోలు తీయడం, చుట్టుముట్టడం లేదా శారీరకంగా తాకడం వల్ల వారు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు తమ భద్రత గురించి ఆందోళన చెందాల్సి వస్తుందని అనుపమ తన అనుభవం ద్వారా వివరించింది. సాధారణంగా అమ్మాయిలు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంటారని ఆమె పేర్కొంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే మహిళల ధైర్యాన్ని అభినందించింది అనుపమ.
ఇవికూడ చదవండి:
- ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా కీరన్ పొలార్డ్ నియామకం!
-
మహిళా నాయకులపై దాడులా?.. చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం!
-
విజయ్ నా లక్కీ చార్మ్.. ఆయన నా ఫేవరెట్ స్టార్!”: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
-
వనాటు దీవుల్లో భారీ భూకంపం…! రిక్టర్ స్కేలుపై 7 .2 తీవ్రతగా నమోదు…