
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి యుద్ధాల గురించి ప్రస్తావించారు. ఎన్నో యుద్ధాలను ఆపాను అని.. మిగతా యుద్ధాలను త్వరలోనే ఆపుతాను అని ట్రంప్ వ్యాఖ్యానించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు యుద్దాలపై ట్రంప్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి ఈ యుద్ధాలపై పాత పాట పాడారు ట్రంప్. ప్రపంచవ్యాప్తంగా శాంతిని తీసుకువచ్చే బాధ్యత నాది అని.. దానికి తగ్గట్లు అన్ని విధాల కూడా ప్రయత్నిస్తాను అని డోనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఇప్పటివరకు ఎన్నో యుద్ధాలను మీరు చూడని విధంగా ఆపి వేశాను అని.. త్వరలోనే అన్ని యుద్ధాలను కూడా సెటిల్ చేస్తాను అని తెలిపారు. కాగా ఇప్పటివరకు 8 యుద్ధాలను నేను స్వయంగా ఆపాను అని… కేవలం ఒక్క యుద్ధం మాత్రమే బ్యాలెన్స్ ఉందని అది కూడా త్వరలోనే ఆపేందుకు చూస్తున్నాను అని పేర్కొన్నారు. అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగితే వెంటనే రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆగిపోతుంది అని స్పష్టం చేశారు. కాగా యుద్ధంలో మరణాలను చూడలేకపోతున్నామని… గత వారం రోజుల్లోనే 8,000 మంది సైనికులు మరణించారు.. ఇక గత నవంబర్ నెలలో ఏకంగా 27 వేల మంది సైనికులు చనిపోయారని డోనాల్డ్ ట్రంప్ యుద్ధంలో చనిపోయినటువంటి సైనికుల లెక్కలను తేల్చి చెప్పారు. ఈ యుద్ధాలు తక్షణమే ఆగిపోవాలి… అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది అని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల పై వివిధ దేశాల ప్రజలందరూ కూడా ప్రశంసిస్తున్నారు. కాకపోతే డోనాల్డ్ ట్రంప్ ప్రతిరోజు కూడా ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తున్నారు మరి కొంతమంది అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : తిరుమలాపూరం గ్రామంలో ‘నత్త నడక’న నామినేషన్ల స్వీకరణ.. అధికారుల నిర్లక్ష్యంపై అభ్యర్థుల ఆందోళన
Read also : పైసా లేకున్నా నిజాయితీగా పోటీ.. చివరికి డబ్బున్నోడిదే రాజ్యం!





