
చండూరు,కైమ్ మిర్రర్:- నల్గొండ జిల్లా చండూరు మండలం ఓ గ్రామ సర్పంచి ఏకంగా నీటి ట్యాంకర్ అమ్ముకోవటం… మూకుమ్మడిగా వార్డు సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేయటం చర్చనీయాంశంగా మారింది.
తీర్మాణం లేకుండానే అమ్ముకోవటం అపై 15 వ ఆర్థికం సంఘం నిధులకు సంబంధించి ఖర్చు విషయంలో చేసిన పనులకు పెట్టిన బిల్లులకు సంభందం లేకుండా ఉన్నట్లుగా ఆరోపణులు గుప్పుమంటున్నాయి. ఇది ఏందని వార్డు సభ్యులు అడిగితే ఎంబీలు ఇలాగే ఉంటాయంటు దబాయిస్తుండటం? అందరిని విస్మయ పరుస్తుంది.
ట్యాంకర్‌ను స్క్రాప్‌కు వేశారు..
గ్రామ పంచాయతీకి సంబంధించి పాత నీటి ట్యాంకర్ ఉంది. అధి జంగు పట్టింది. అయితే వార్డు సభ్యులు అందరు కలిసి కొత్త ట్యాంకర్ కొనాలని తీర్మానం చేశారు. తీరా చూస్తే ట్యాంకర్‌ను 16వేలకు స్క్రాప్‌కు వేశామని వచ్చిన డబ్బును గ్రామ పంచాయతీలో జమచేశామని సర్పంచి చెప్పారు. అయితే తాము ఎక్కడ పాత ట్యాంక్‌ను స్క్రాప్‌కు వేయాలని తీర్మాణం చేయలేదని అయినా అంత ట్యాంక్‌ను అమ్మితే కేవలం 16వేలు మాత్రమే ఎలా వస్తాయంటు వార్డు సభ్యులు వాపోతున్నారు. కొత్త ట్యాంకర్‌ను రూ.2.47 లక్షలకు
తీసుకొచ్చారు. దాని విలువ అంత ఉండదని అయినా సరే అది నాసిరకంగా ఉందని అపుడే లీకేజీ అవుతుందంటు వార్డు చెపుతున్నారు. పైగా పాల ట్యాంకర్ టైర్లనే కొత్త ట్యాంకర్‌కు వేయటం మరీ విడ్డూరంగా మారింది.
10లక్షల పనుల్లో అంతా గోల్మాల్?
15వ ఆర్థిక సంఘం నిధులు మొత్తం 27లక్షలు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు జీతాలు గత పాలకులు ఖర్చు చేసిందంటు మొత్తం కలసి 7లక్షలు పోగా మిగిలిన 10లక్షలతో గ్రామంలో వివిద పనుల పేరుతో ఎంబీలు పెట్టారు. అయితే మోటార్లు, లైట్ల ఖర్చు విషయంలో అయ్యే ఖర్చుకు పెడుతున్న ఎంబీలకు సంభందం ఉండటం లేదని వార్డు సభ్యులు వాపోతున్నారు. ఇక జేసీబీలతో చేయించే పనులకు అంత లేని అవినీతి జరుగుతుందని వార్డు సభ్యులు చెబుతున్నారు. అన్ని దొంగ లెక్కలు రాస్తున్నారని నిధులు కాజేశారని ఎవరు ఆ బిల్లులను చూసి ఇట్టే అర్థం అవుతుందంటున్నారు వార్డు సభ్యులు. మిషన్ భగీరత పైపులైన్ తవ్వకాలు, ఇతర చిన్న చిన్న పనులకు అడ్డగోలుగా బిల్లులు రాసినట్లు తెలుస్తోంది.
విచారణలో అన్ని తేలుతాయి…
ఈ విషయమై సర్పంచి సత్యాన్ని వివరణ కోరగా అన్ని లెక్క ప్రకారమే చేశామని ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇప్పటికే ఫిర్యాదు అధికారులకు అందటంతో విచారణకు వస్తున్నారని విచారణలో అన్ని తేలుతాయి అన్నారు.