
క్రైమ్‌మిర్రర్,కీవ్: గత నాలుగు సంవత్సరాలుగా ఉక్రెయిన్- రష్యా యుద్దం కొనసాగుతూనే ఉంది. దీంతో ఒకరిపై ఒకరు ప్రతిదాడుల మూలంగా వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తీవ్రమైన ఆర్థిక నష్టం చోటు చేసుకుంది. ఈ క్రమంలో శాంతించినట్టే కనిపించినప్పటికీ మళ్లీ ఇరు దేశాల మధ్య యుద్దం తీవ్ర రూపం దాల్చుతుంది. తాజాగా రష్యా అంతటా ఉక్రెయిన్ వెయ్యి డ్రోన్లతో భీకరమైన దాడులు జరిపింది. ఇది చరిత్రలోనే అతి పెద్ద దాడి. సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని చమురు ఎగుమతి టెర్మినల్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయగా.. భారీగా మంటలు చెలరేగాయి.
రష్యాకు చెందిన రిటైల్ సంస్థ ఓజోన్‌కు చెందిన లాజిస్టిక్స్ కేంద్రం, స్థానిక టెక్నాలజీ దిగ్గజం వీకేకు చెందిన డాటా సెంటర్‌ను కూడా ఉక్రెయిన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. స్థానిక గవర్నర్ అలెగ్జాండర్ బెగ్లోవ్ మాట్లాడుతూ తమ భద్రతా దళాలు ఉక్రెయిన్ డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేశాయన్నారు. ఈ దాడుల్లో ఒకరు మరణించగా ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. చమురు సంస్థలపై దాడులు అస్సలు క్షమించదగ్గవి కావన్నారు. ఇంకోవైపు ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా నగరంపై రష్యా రెండు దాడులు చేసింది. ఇందులో ఒక మహిళ మరణించగా.. ఆరేండ్ల బాలిక గాయపడింది.