
రామకృష్ణాపూర్(క్రైమ్ మిర్రర్):- రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గుడుంబా,లిక్కర్ విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గుడుంబా, అక్రమ లిక్కర్ విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించిన పోలీసులు, వారిని మందమర్రి తహశీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేశారు.ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ ఎస్సై ఎల్. భూమేష్ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో గుడుంబా, అక్రమ లిక్కర్ రహిత సమాజం లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మళ్లీ అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే, సంబంధిత వ్యక్తులపై కఠినమైన నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలకు సంబంధించి ఎవరైనా సమాచారం కలిగి ఉంటే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలను కోరారు.
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రామకృష్ణాపూర్
ఎల్. భూమేష్
📞 సెల్: 87126 56572
Read also : అధికారులకు ఫిర్యాదు చేస్తే బడి నుంచి గెంటివేస్తారా? KGBV విద్యార్థిని కన్నీటి గాథ!
Read also : తమిళనాడులోను మన ప్రభుత్వమే వస్తుంది.. ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా





