
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సంక్షేమ మరియు అభివృద్ధి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయా జిల్లాలలో, మండలాలలో మరియు గ్రామాలలో పనులు చేసినప్పుడు వాటిని ఊరికే చెప్పుకోవడం కాకుండా ఇది చేశామంటూ.. ఇంకా వేరేవి చేయబోతున్నామంటూ ప్రజల దగ్గరకు వెళ్లి వివరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి నాయకులకు దేశాన్ని నిర్దేశం చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షలు చీరల పంపిణీ ని డిసెంబర్ నెల ముగిసే లోపు పూర్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా జరిగిన ఒక భేటీలో అధికారులను ఆదేశించారు. మరోవైపు పట్టణ ప్రాంతాలలోని మహిళలకు 35 లక్షల చీరలను వచ్చే ఏడాది మార్చిలో పూర్తి చేయాలి అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేలా వివరించాలి అని సూచించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. చేసిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలకు చెప్తేనే అది తెలుస్తుంది.. లేకుంటే చేసిన పని కూడా వృధా అయినట్లే అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. ప్రతి జిల్లాకి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ప్రతి జిల్లా అధ్యక్ష పదవి అనేది ఒక గొప్ప బాధ్యతగా ఆ మనిషి స్వీకరించి ముందుకు సాగాలి అని… ఎవరైనా సరే నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని సీఎం హెచ్చరించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం, మండలం అలాగే పంచాయతీలలో ని ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి అని సూచించారు.
Read also : ఎక్కడో చెట్లు ఎండితే అది మా దిష్టి ఎలా అవుతుంది.. పవన్ క్షమాపణలు చెప్పాలి : మంత్రి పొన్నం
Read also : Preschool For Children: తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..





