క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమాన పరిచారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం ఇలాంటివి మాట్లాడకూడదన్నారు. అయితే సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ చైర్మన్ చెప్పారు. శాసనసభ ప్రాంగణంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాయిదా తీర్మానం ఇచ్చారు.
Read Also : దారులన్నీ ఇంద్రవెల్లి వైపే.. మహాపూజతో నేటి నుండి ఆదివాసీ ఉత్సవం షురూ..
విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై సభలో చర్చించాలని ఆమె కోరారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల కండువాలను వేసుకొని శాసన మండలికి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. నల్ల కండువాలు వేసుకొని రావద్దని పోలీసులు సూచించారు. నిరసన తెలపడం తమ హక్కని, కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, శోభన్ రెడ్డి, తాతా మధు, మహమూద్ అలీ తదితరులు సభలోకి వెళ్లిపోయారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు. ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపారు.
Also Read : రేవంత్ రెడ్డి దెబ్బకు నీరుగారిపోతున్న బీఆర్ఎస్… కేసీఆర్‌కు పెద్ద కష్టమే!!!
హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకూ ప్రయాణించారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్లకార్డులను ప్రదర్శించారు. 6.5 లక్షల మంది రోడ్డున పడ్డారని, వారికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు. మరోవైపు సభలోకి ప్లకార్డులను తీసుకెళ్లేందుకు భారాస నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది.
ఇవి కూడా చదవండి :
One Comment