
-
చుట్టూ ముడుతున్న ఎల్ నినో ప్రమాదం
-
తీవ్ర సాగు, తాగునీటి ఎద్దడి.. ఆపై విద్యుత్ కొరత
-
గట్టెక్కాలంటే కేంద్రం సాయం చేయాల్సిందే
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో తీవ్ర వర్షాభావం నెలకొంది. దుర్భిక్షం కొనసాగుతోంది. కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం అధికంగా ఉంది. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ఈ తరుణంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు, కరువు కాటకాలను పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెడుతోంది. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ రంగానికి జరిగే తీవ్ర నష్టం, తాగు- సాగునీటి ఎద్దడి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదాన్ని గుర్తించిన సర్కార్.. తక్షణ సహాయక చర్యల కోసం సుమారు పదివేల కోట్లతో సమగ్ర ఉపశమన ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి నిర్దేశించిన అప్పుల పరిమితి దాదాపుగా పూర్తయింది. అందుకే అదనపు నిధుల సమీకరణ ప్రభుత్వానికి సవాల్ గా మారింది.
కేంద్ర సాయం కోసం…
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కేంద్రం ఉదారంగా ఆదుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అత్యవసర లేఖ రాసింది. ఎల్ నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులు, పంట నష్టాలు, తాగునీటి ఎద్దడిని నియంత్రించేందుకుగాను అత్యవసర ఖర్చులను సాధారణ బడ్జెట్ అప్పుల పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, ఎఫ్ ఆర్ బి ఎం నిబంధనలను పరిగణలోకి తీసుకొని.. ప్రత్యేక మినహాయింపు కింద పదివేల కోట్ల రూపాయల అదనపు అప్పులు తీసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.
దాటిపోయిన అప్పుల పరిమితి…
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన అప్పుల పరిమితి తీరిపోయింది. ఇప్పుడు అదనపు రుణాలు లభిస్తే కానీ పరువు పరిస్థితులను సమర్థవంతంగా సహాయ చర్యలు అందించే అవకాశం లేదు. వ్యవసాయ రుణాల ఊరట, రైతులకు నష్టపరిహారం, ఉపాధి హామీ పథక విస్తరణ, సాగునీటి యాజమాన్యం, పశుగ్రాసం సరఫరా వంటి ముందస్తు చర్యలకు ఈ నిధులు వెక్కించాల్సి ఉందని లేఖలో సమగ్రంగా వివరించింది. కేంద్రం సానుకూలంగా స్పందించి రుణపరిమితిని పెంచకపోతే.. రాష్ట్ర బడ్జెట్ పై తీవ్ర ప్రభావం పడి సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు మందగించే ప్రమాదం ఉంది. మరోవైపు వాతావరణం మార్పులు వంటి అనివార్య విపత్తుల సమయంలో కేంద్ర నిబంధనలను సడలించి రాష్ట్రాలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. తీవ్ర సంక్షోభం సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
ఇవి కూడ చదవండి:
-
‘బలగం’ వేణుకు మార్చి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
-
రాజీవ్ చౌక్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. నేటి నుంచి 3 రోజుల పాటు కల్వర్టు నిర్మాణ పనులు: మున్సిపల్ కమిషనర్
-
ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం…! ఊపిరి పీల్చుకున్న ప్రయాణీకులు..
-
గడ్డపోతారం ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్ర్బాంతి…! మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి…