
సంచలన నిర్ణయాలకు కేర్రాఫ్ అడ్రెస్ డోనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు… దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. అక్రమవలసదారులను సంకెళ్లు వేసి వెనక్కి పంపడం దగ్గర నుంచి…. జన్మతః పౌరసత్వం రద్దు నిర్ణయం వరకు ట్రంప్ తీసుకున్న డెసిషన్ష్ అన్నీ సంచలనాలే. ఇప్పుడు… మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అయితే అది కేవలం… ధనికుల కోసం మాత్రమే అంటున్నారు. అదేంటో చూద్దాం.
గోల్డ్ కార్డ్ వీసా… ఇదే ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం. ఇది విదేశాల్లో ఉన్న సంపన్నులకే ఇస్తారు. ఏ దేశంలో ఉన్న వారైనా సరే… అమెరికాలో 5 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే… గోల్డ్ కార్డ్ వీసా మంజూరు చేస్తారు. ఇది… అమెరికా పౌరసత్వం పొందేందుకు పెట్టుబడిదారులకు మంచి అవకాశం అని అంటున్నారు అధ్యక్షుడు ట్రంప్. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈబీ-5 వీసా స్థానంలో.. గోల్డ్ కార్డ్ వీసాను తెస్తున్నారు.
ఈబీ-5 వీసా.. 1990 నుంచి అమల్లో ఉంది. దీని ప్రకారం… అమెరికాలో గ్రీన్ కార్డు కావాలనుకునే వారు… పెట్టుబడి పెట్టి ఉపాధి సృష్టించాలి.. అందుకు 8 లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఈ వీసా విధానంలో మోసాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో… దీనిని రీప్లేస్ చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈబీ-5 వీసా స్థానంలో గోల్డ్ కార్డ్ వీసా (GOLD CARD) తీసుకొచ్చారు. గోల్డ్ కార్డ్ వీసా కావాలంటే… ఏకంగా 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యతిరేకత కూడా వస్తోంది.
గోల్డ్ కార్డ్‌ను విడుదల చేస్తూ ట్రంప్ మాట్లాడారు… దీని ద్వారా గ్రీన్ కార్డు పొందవచ్చని చెప్పారు. ఈ విధానం అమెరికాను బలోపేతం చేయడానికి… పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అమెరికన్ పౌరసత్వం కల్పించేందుకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. ఈ గోల్డ్ కార్డ్ గురించిన పూర్తి వివరాలను రెండు వారాల్లో విడుదల చేస్తామన్నారు ట్రంప్.