
-
గత కొంతకాలంగా తెలంగాణ ఎన్నికలకు దూరంగా తెలుగుదేశం
-
చివరిసారిగా 2018 లో పోటీ
-
దారుణ పరాజయంతో ఏపీకే పరిమితం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రీ ఎంట్రీ పై రకరకాల ప్రచారం నడుస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందంటూ కొత్త ప్రచారం మొదలైంది. ఈ మేరకు తెలంగాణ పార్టీ నేతలు అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించనుంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సైతం అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశం ఉంది. అదే జరిగితే బహుముఖ పోటీ ఖాయం. ఎవరికి విజయావకాశాలు ఉంటాయో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే కాంగ్రెస్ తో పాటు బిజెపి, ఆపై బి ఆర్ ఎస్ కచ్చితంగా పోటీచేస్తాయి. మరోవైపు తమ పార్టీ అభ్యర్థి కూడా రంగంలో ఉంటారని కవిత ప్రకటించారు. ఇప్పుడు టిడిపి పోటీ చేస్తే మాత్రం బహుముఖ పోటీ కావడం ఖాయం.
పట్టున్న ప్రాంతం…
ఖైరతాబాద్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉంది. ఎందుకంటే అక్కడ సెటిలర్స్ అధికం. అందుకే అక్కడ పోటీ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇటీవల తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి పోటీలో ఉండడం లేదు తెలుగుదేశం. అది వ్యూహాత్మకమో తెలియడం లేదు. లేకుంటే భాగస్వామ్య పార్టీ బిజెపి నుంచి ఒత్తిడి ఉందో తెలియడం లేదు. పోటీకి మాత్రం టిడిపి దూరంగా ఉంటూ వస్తోంది. చివరిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళింది టిడిపి. దారుణమైన ఓటమి ఎదురుకావడంతో తెలంగాణ ఎన్నికల్లో అస్సలు పోటీ చేయడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని సన్నాహాలు మొదలుపెట్టింది. ఇంతలోనే ఏపీలో చంద్రబాబు అరెస్టు అయ్యారు. దీంతో తెలంగాణలో పోటీ చేయాలన్న ప్రయత్నం విరమించుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా టిడిపి పోటీ చేయలేదు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా దూరంగా ఉంటూ వస్తోంది.
భాగస్వామ్య పార్టీలు…
అయితే ఇప్పుడు జనసేన సైతం ఖైరతాబాద్ లో పోటీ చేసేందుకు సిద్ధపడుతోంది. ఎలాగూ బిజెపి అభ్యర్థి రంగంలోకి ఉంటారు. ఈ తరుణంలో టిడిపి అభ్యర్థిని దింపడం అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది. టిడిపి పోటీ చేయకపోవడం వల్ల అక్కడ క్యాడర్ విచిత్రంగా కాంగ్రెస్ వైపు మల్లుతోంది తెలంగాణలో. ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఇప్పటికీ టిడిపి మనిషిగా చూసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అందుకే టిడిపి నాయకత్వం సైతం ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎటువంటి పిలుపు ఇవ్వడం లేదు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ కు మద్దతుగా నిలిచింది టిడిపి క్యాడర్. ఇప్పుడు కూడా బలమైన మద్దతు దారుగా ఉంటుంది రేవంత్ రెడ్డికి టిడిపి శ్రేణులు. ఈ పరిస్థితుల్లో పోటీ చేస్తే కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది కాంగ్రెస్ గెలుపు పై. అదే సమయంలో భాగస్వామ్యలు బిజెపి, జనసేన సైతం రంగంలో ఉండడంతో.. పోటీకి దూరంగా ఉండడమే మేలన్న నిర్ణయానికి టిడిపి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇవి కూడ చదవండి:
-
ప్రేమ వ్యవహారం విషాదాంతం.. యువతిపై దాడి చేసి యువకుడి ఆత్మహత్య
-
మైనర్ బాలికపై అఘాయిత్యం.. 45 ఏళ్ల వ్యక్తిపై కేసు
-
అనంతపురంలో అమానవీయ ఘటన.. కంపచెట్టుపై అప్పుడే పుట్టిన శిశువు
-
తాగునీటి ట్యాంక్లో బల్లి మృతి.. 12 మంది కార్మికులకు అస్వస్థత