తెలంగాణ

కేసీఆర్ హీరో.. రేవంత్ జీరో.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్ ఇచ్చారు. బహిరంగసభలో బహిరంగంగానే రేవంత్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రిని మెచ్చుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే ఆగ్రహంతోనే రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడారనే టాక్ వస్తోంది.

చౌటుప్పల్ పర్యటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై
సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ గొప్పగా ప్రవేశపెట్టిన రైతు బంధును గత ఏడాది ఎగ్గొట్టామని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదును తగ్గించామని తెలిపారు. అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని తిడుతున్నారని అన్నారు.

రుణ మాఫీ కాలేదని.. రైతు బంధు రాలేదని జనాలు మా ముఖ్యమంత్రిని ఫుల్లు తిడుతున్నారని.. అదే 2 లక్షల రుణ మాఫీ అయినోల్లు మాత్రం జేబులో వేసుకొని సప్పుడు చేస్తలేరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపకల్పన తీరు సరిగా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీ చేసిన వారికి ఆత్మీయ భరోసా ఇస్తారట .. ఏ లెక్కన ఇస్తున్నారో నాకు అర్థమైతలేదని ఓపెన్ గానే చెప్పేశారు. రెండు రోజుల క్రితమే తాను బీజేపీలోనే ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదని.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు.

Back to top button