
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్పు శంకర్ ఇటీవల గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశం మొత్తం కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ ప్రమాదం జరిగిన సమయంలోనే పక్కన ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే అక్కడి కార్మికులు ఫైర్ ఇంజన్ వచ్చేవరకు ఆగకుండా… సహాయక చర్యలు చేపట్టడంతో పిల్లలందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అందులో ఒకడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్. సమయంలోనే మార్పు శంకర్ పొగ ను బాగా పీల్చడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. మార్పు శంకర్ అలాగే మరో పాపను అక్కడే ఉన్నటువంటి కార్మికుడు రెండు చేతులతో ఇద్దరిని తీసుకొని బయటికి వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఒక పాప మరణించగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అదృష్టంతో బ్రతికిపోయాడు. వెంటనే ఆ కార్మికులు మార్క్ శంకరును ఆసుపత్రికి తీసుకెళ్లి ఈ ప్రధమ చికిత్స చేయించారు.
ఇది వెంటనే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అలాగే మెగా ఫ్యామిలీ అందరూ కూడా వెంటనే ఆస్పత్రికి వెళ్లి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు మార్పు శంకర్ ఆరోగ్య వైద్యం ఎంత అయ్యిందో అని ఆలోచిస్తున్నారు. కానీ మార్కు శంకర్ ఆరోగ్య వైద్యం విలువ తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షాకవాల్సిందే. ఎందుకంటే మార్కు శంకర్ వైద్య ఖర్చు కేవలం 7000 మాత్రమే. మార్క్ శంకర్కు చేసిన బ్రోన్కోస్కోపీ వైద్య ఖర్చు కేవలం 4000 నుండి 30 వేల రూపాయలు మాత్రమే. ఈ ఖర్చు పవన్ కళ్యాణ్ కు చిటికెన వేలుతో సమానం. ప్రతి ఒక్కరు కూడా కొన్ని లక్షల్లో లేదా కోట్లలో ఖర్చు అయ్యుంటుందని భావిస్తారు. కానీ డాక్టర్లు తెలిపిన ఖర్చు కేవలం 30000 లోపు మాత్రమే. దీంతో ఈ వైద్య ఖర్చును చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇదే మన రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా చేయించుకోవచ్చు.