
నవజ్యోతి, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం… వివరాల్లోకి వెళితే సూరారం గ్రామపంచాయతీ సమీపంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఎర్రటి జాకెట్ బట్ట, నిమ్మకాయలు కోడిగుడ్లు, పసుపు కుంకుమ ఉంచి క్షుద్ర పూజలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున వాటిని చూసినా గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు మండలంలో తరచుగా జరుగుతుండగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.ఇక పై ఇలా చేసినవారిని అధికారులు గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
దుద్దిళ్ళ శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ఉచిత కంటి పరీక్ష చికిత్స శిబిరం ఏర్పాటు