క్రైమ్

చంద్రబాబుకు బాంబు పెట్టిన మావో అగ్రనేత ఎన్ కౌంటర్

మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారుతో మావోయిస్టు పార్టీ తుడుచుపెట్టుకుపోతోంది. ఆపరేషన్ బ్లార్ ఫారెస్టులో వందలాది మంది మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టు అగ్రనేతలు సహా 28 మంది హతమయ్యారు. 2003లో అలిపిరిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మందు పాతర పెట్టి పేల్చేసిన మావోయిస్టు మాస్టర్ మైండ్ కూడా తాజా ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.

దేశంలోని మావోయిస్టు టాప్ త్రీ లీడర్లలో ఒకరైన నంబాల శేఖర్ రావు ఛత్తీస్ గడ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో హతమయ్యాడు.ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతిచెందినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో పెద్ద నేత చనిపోవడం ఇదే తొలిసారని అమిత్‌షా చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 27 మంది హతమయ్యారు. ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్ తర్వాత..54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని అమిత్ షా వెల్లడించారు. మరో 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. 2026 మార్చి 31నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

Back to top button