
క్రైమ్ మిర్రర్, వలిగొండ :- యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండల పరిధిలోని అరుర్ గ్రామపంచాయతీ పరిధిలోని మోర్సుబావి దగ్గర వేలాడుతున్న విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం. పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్న పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని రైతులు కోరుతున్నారు. DE కి AE కి ఎన్ని సార్లు మొర పెట్టుకున్న స్పందించని అధికార యంత్రాంగం. రైతులు పొలం దున్నాలన్న, వరి చేను కోసుకోవాలన్న వేలాడుతున్న విద్యుత్ వైర్లతో భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే పై అధికారులు స్పందించి ఈ యొక్క వైర్లను తొలగించి రైతులను ప్రమాదం నుండి కాపాడాలని.. పరిసర ప్రాంత పొలం రైతులు కోరుతున్నారు.
Read also : భార్య కోసం తల్లిదండ్రులను ముక్కలుగా నరికి చంపాడు
Read also : తెలంగాణ పోలీస్ విభాగంలో 325 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్





