జాతీయం

కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. ఉత్తరాదిలో 45 డిగ్రీల ఎండ.. ఇదేం వాతావారణం

దేశంలో కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. జమ్ము కశ్మీర్‌లో కురిసిన అకాల వర్షాలు, తలెత్తిన వరదు ముగ్గురి ప్రాణాలు తీశాయి. ఈ వానల కారణంగా జమ్మూ కశ్మీర్లో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 21న జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో వర్షాలతోపాటు గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

జమ్మూ కశ్మీర్‌తో పాటు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయా ప్రాంతాల్లో ఏప్రిల్ 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానికంగా వరదలు, అంతరాయాలు ఏర్పడవచ్చని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలతోపాటు గంటకు 30-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఈశాన్య భారతదేశంలో కూడా రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.

మరోవైపు వర్షాలు దంచికొడుతుంటే … వాయవ్య, మధ్య భారతదేశంలో మాత్రం హీట్‌వేవ్ హడలెత్తిస్తోంది. విదర్భ, దక్షిణ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో రాబోయే ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వడగాలుల వీచే ఛాన్సుంది కాబట్టి, బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Back to top button