సినిమా

తొలి రోజే ఊహించని కలెక్షన్లు…!

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- ఏదైనా సరే చిత్ర పరిశ్రమలో ఒక సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఆ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అయితే తాజాగా కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతారా చాప్టర్-1 సినిమాకు తొలి రోజు భారీ కలెక్షన్లు వచ్చినట్లుగా సినీ వర్గాలు పేర్కొన్నాయి. దసరా పండుగ రోజు విడుదలైన ఈ సినిమా మొదటి రోజే వరల్డ్ వైడ్ గా అన్ని ప్రీమియర్స్ తో కలిపి 65 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లుగా సినిమా వర్గాలు తెలిపాయి. దీంతో రిషబ్ శెట్టి ఈ సినిమాతో మరొక చరిత్ర సృష్టిస్తారని అర్థమవుతుంది. కాంతారా మొదటి భాగం ఎంతమందికి నచ్చిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా 100 కోట్ల కలెక్షన్లు దాటి మరో రికార్డ్స్ సృష్టిస్తే ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 65 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా మరో రోజు లేదా రెండు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సులభంగా దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక హిందీలో కూలి 65 కోట్లు, చావా 32 కోట్లు, సికిందర్ 26 కోట్లు, సయారా 22 కోట్లు తొలిరోజు కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళుతున్న సందర్భంగా మరొక వారం రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్లు కలెక్షన్లు దాటే అవకాశం కూడా ఉంది. ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తున్న సందర్భంగా చాలామంది సినిమా హీరోలు కూడా రిశబ్ శెట్టికి అలాగే చిత్ర బృందానికి విషెస్ చెబుతున్నారు.

Read also : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు!

Read also : మరో నాలుగు రోజులు వర్షాలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button