తెలంగాణవైరల్

బిగ్ బాస్ లో నుంచి మరో వైల్డ్ కార్డు అవుట్.. దడ పుట్టిస్తున్న ఇంటర్వ్యూ?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బిగ్బాస్ సీజన్-9 ఈసారి చాలా కొత్త పద్ధతితో ప్రారంభించారు. ఒకవైపు సామాన్యులు మరో వైపు సెలబ్రిటీలు ఇద్దరు కూడా హౌస్ లో ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, గొడవలు పడుతూ, నవ్వుకుంటూ, ఏడ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ వారం తాజాగా దువ్వాడ మాధురిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్ ప్రక్రియలు దువ్వాడ మాధురి, సంజన, రీతు చౌదరి, పవన్ కళ్యాణ్, తనూజ, రాము, డిమాండ్ పవన్ మరియు గౌరవ్ ఉండగా… ఆడియన్స్ నుంచి అతి తక్కువ ఓట్లు మాధురికి రావడంతో ఆమె ఈ వారమే ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన.. ఈ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి దువ్వాడ మాధురి అది కొద్ది తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదిక వేదికగా భారీ ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఇద్దరు కలిసి ఎక్కడి పడితే అక్కడ రోడ్లు మీద విచ్చలవిడిగా రీల్స్ చేసుకుంటూ సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నట్లు చాలామంది మొన్నటి వరకు కూడా బాగా ట్రోల్స్ చేశారు. ఇలాంటి వారిని బిగ్ బాస్ లోకి తీసుకురావడం అనేది మరో పెద్ద తప్పు అని.. ఏది ఏమైనా కూడా వెంటనే ఈమె ఎలిమినేట్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా ఉంది. ఇక ఎలిమినేట్ అయిన మాధురి శివాజీ తో ఇంటర్వ్యూలో భాగంగా రెచ్చిపోయారు. ఈ ఇంటర్వ్యూలో శివాజీ మరియు మాధురి మధ్య బాగానే మాటల యుద్ధం హవా నడిచింది. నీది తప్పంటే నీది కాదా అంటూ… ఇద్దరి మధ్య ఇంటర్వ్యూ ప్రోమో అదిరిపోయిందనే చెప్పాలి. ఈ ఇంటర్వ్యూ కోసం చాలామంది కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Read also : ఘోర రోడ్డు ప్రమాదం… కంకర లోడు టిప్పర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు… డ్రైవర్ మృతి!

Read also : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే బంధువులు 4 మృతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button