
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో దసరా పురస్కరించుకొని కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి. దసరా పండుగ ముందు నాలుగు రోజుల వ్యవధిలోని ఏకంగా 800 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు జరిగాయని అధికారులు తెలపడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. దసరా పండుగ రోజునే గాంధీ జయంతి కావడంతో ఎవరూ కూడా మందు షాపుల వైపు చూడరు అని అనుకున్నారు. కానీ మద్యం విషయంలో ఏది కూడా లెక్క చేయని మందుబాబులు.. దసరా రోజు కూడా మద్యం షాపులకు క్యూలు కట్టారు. దీంతో ఇంకేముంది… ఎటు చూసినా కూడా లెక్కరే. ఈ లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి గట్టిగానే ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 28వ తేదీన 200 కోట్లు, సెప్టెంబర్ 29న 278 కోట్లు, సెప్టెంబర్ 30 మరియు అక్టోబర్ ఒకటవ తేదీన మొత్తం 419 కోట్ల సేల్స్ జరిగాయని అధికారులు తాజాగా వివరాలను వెల్లడించారు. ప్రతిరోజు పోలిస్తే సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమ్మకాలు రెట్టింపు అయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే ఇంతలా లిక్కర్ అమ్మకాలు జరగడానికి కారణం ఏంటని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఇంత లిక్కర్ అమ్ముడవ్వడానికి ముఖ్య కారణం దసరాతో పాటుగా స్థానిక ఎన్నికలు. మొత్తం సెప్టెంబర్ నెలవ్యాప్తంగా కేవలం లిక్కర్ ద్వారానే 3046 కోట్ల మద్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Read also : ఆహా రూమర్స్… చివరికి ఎంగేజ్మెంట్ తో ఒకటైన రష్మిక, విజయ్ దేవరకొండ!
Read also : రాబోయే తెలంగాణ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు