తెలంగాణరాజకీయం

రాజగోపాల్ రెడ్డి‌పై చర్యల దిశగా కాంగ్రెస్… పిసిసి క్రమశిక్షణ కమిటీకి కీలక సమావేశం.!

రేవంత్‌పై విమర్శలతో అసహనంలో అధిష్టానం - మల్లురవి నేతృత్వంలో ఇవాళ కీలక చర్చ

హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పార్టీ క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకునే దిశగా PCC అడుగులు వేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గత కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న తీవ్ర విమర్శలు పార్టీ వర్గాల్లో అసహనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లు రవి నేతృత్వంలో జరగనున్న పిసిసి క్రమశిక్షణ కమిటీ సమావేశం కీలకంగా మారింది. సమావేశంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై విశ్లేషణ చర్యలు తీసుకునే అవకాశముంది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సియం రేవంత్ రెడ్డి నిన్న మల్లురవితో ప్రత్యేకంగా సమావేశమై, పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం. గజ్వేల్‌లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ నేతల భేటీలో పార్టీ పంచాయతీ, అంతర్గత విభేదాలపై కూడా అభిప్రాయాలు వచ్చాయని, ఇవి కూడా ఈ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే సూచనలు ఉన్నాయి.

రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీలో చేరి అనంతరం మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయినా, రేవంత్ రెడ్డి నేతృత్వం పట్ల ఆయన పెట్టుకునే విమర్శల ధోరణి అధిష్టానానికి నచ్చడం లేదని పిసిసి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పార్టీ గౌరవాన్ని కాపాడే దిశగా క్రమశిక్షణ చర్యలకే మొగ్గు చూపనున్నట్టు పక్కా సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఈ నిర్ణయానికి ఎలా స్పందిస్తారన్నది, భవిష్య రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపనుంది.

Back to top button