
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:-నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరొక గుడ్ న్యూస్. బాలకృష్ణకు సినిమా రంగంలో ఒక హీరోకి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి. తన నటనకు అభిమానులు అందరూ ఫిదా కావాల్సిందే. డైలాగ్స్ చెప్పాలన్నా, యాక్షన్స్ సీన్స్ చేయాలన్నా, నవ్వించాలన్నా, ఏడిపించాలన్న బాలయ్య తరువాతే ఎవరైనా. అలాంటిది బాలకృష్ణ మరోసారి తన నోటి నుంచి పాట రాబోతుంది. బాలకృష్ణ తన తర్వాత సినిమా కోసం మరోసారి సింగర్ గా మారిపోతున్నట్లు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించారు. బాహుబలి సినిమా లోని సాహోరే బాహుబలి సాంగ్ తరహాలో ఈ పాట ఉండబోతుంది అని తమన్ హైప్ పెంచుతున్నారు.
Read also : ఆహా ఎట్టకేలకు తగ్గిన నిరుద్యోగ రేటు.. PLFS కీలక నివేదిక వెల్లడి!
బాలకృష్ణ తన తర్వాత సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతుంది అని.. గతంలో బాలకృష్ణ పైసా వసూల్ సినిమాలో “మామ ఏక్ పెగ్ లా” అనే సాంగ్ పాడిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరోసారి ఇలాంటి ఎనర్జిటిక్ సాంగ్ పాడేందుకు బాలకృష్ణ రెడీ అవుతున్నారు అని ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే తమన్ ఇక్కడ సాహోరే బాహుబలి రేంజ్ లో పాట రాబోతుంది అనడంతో మరి బాలకృష్ణ ఆ పాటను ఎలా పాడుతారో అనేది చాలామంది అభిమానులకు ఆసక్తికరంగా మారిపోయింది. ఏది ఏమైనా కూడా మామ ఏక్ పెగ్గుల అనే సాంగ్ ఇప్పటికీ కూడా చాలా సందర్భాలలో ట్రెండింగ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సాంగ్ ఎలా ఉన్నా కూడా దాన్ని ట్రెండింగ్ చేసే బాధ్యత మాత్రం అభిమానులు తీసుకుంటారు అని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు.
Read also : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఐపీఎల్ తాజా అప్డేట్స్ ఇవే?





