ఆంధ్ర ప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మృతి..!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజుల నుంచి పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఈ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామున హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఈ విషయాన్ని స్వయంగా తన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా మొట్టమొదటిసారిగా రాంభూపాల్ రెడ్డి 1994లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఆ తరువాత ఎన్నో సందర్భాలలో గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు. కానీ ప్రస్తుతం ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి మాత్రం వైసిపి స్టేట్ కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా కూడా అభివృద్ధిపై రాంభూపాల్ రెడ్డి కుటుంబం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు అతని నివాసంకు చేరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా మరికొంతమంది తనకు సంతాపం తెలియజేస్తున్నారు.

Read also : తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!.. సరైన నాయకుడిని ఎన్నుకోండి?

Read also : Prawns: రొయ్యలు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button