ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

అమ్మో.. జగన్‌ అడ్డానా వద్దు వద్దు - ఈసారికి కడప చాలు..!

జగన్‌ జోలికి వెళ్లేందుకు టీడీపీ భయపడుతోందా…? పులివెందులలో అడుగు పెట్టే సాహసం చేయలేకపోతుందా…? వైసీపీ అధినేత అడ్డాలో పాగా వేస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి…? మహానాడు వేదిక పులివెందుల నుంచి కడపకు ఎందుకు మారుతోంది..? పులివెందుల వద్దు.. కడపే ముద్దు అంటూ… తెలుగు దేశం కొత్త రాగం ఎందుకు పాడుతోంది..?

వైనాట్‌ పులివెందుల స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని భావించిన టీడీపీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. వచ్చే నెల (మే) 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించబోతోంది. ఈ మహానాడును వైఎస్‌ జగన్‌ నియోజకవర్గమైన పులివెందులలో నిర్వహించాలని భావించింది. మహానాడు పేరుతో జగన్‌ అడ్డాలో బలప్రదర్శన చేసి… అక్కడి పార్టీ క్యాడర్‌లో మరింత ఉత్సాహం నింపి… ప్రతిపక్ష నాయకుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని ప్లాన్‌ చేసింది. కానీ… ఇంతలో ఏమైందో… నిర్ణయం మార్చుకున్నట్టు సమాచారం. పులివెందుల వద్దు.. ఈసారి కడప చాలు అని సరిపెట్టేసుకుంటోంది. కడపలోనే మహానాడు నిర్వహించాలని టీడీపీ డిసైడ్‌ అయినట్టు సమాచారం. కడపలో స్థల పరిశీలన కూడా చేస్తున్నారట ఆ పార్టీ నేతలు.


Also Read : దిల్ షుగ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్.. 12 ఏళ్లుగా ఏం జరిగింది.


పులివెందుల నుంచి టీడీపీ ఎందుకు వెనక్కి తగ్గిందన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే… జగన్‌ అడ్డాలో మహానాడు నిర్వహిస్తే.. అసలుకే ఎసరు వస్తుందనే భయం మాత్రం టీడీపీలో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్‌ సొంతగడ్డకు వెళ్లి ఆయన్నే తిడితే… అది టీడీపీకి మంచి చేయకపోతే… చెడే ఎక్కువగా చేస్తుందన్న ఆందోళన ఉంది ఆ పార్టీలో. జగన్‌పై ఎంత తీవ్రంగా విమర్శలు చేస్తే.. ఆయనకు అంత సానుభూతి పెరుగే ప్రమాదం కూడా ఉందని తెలుగు దేశం పార్టీ లెక్కలేస్తోంది. తమ ప్రాంతానికే వచ్చి తమ నాయకుడిపైనే విమర్శలు చేస్తారా..? అన్న కోపం పులివెందుల ప్రజల్లో ఎక్కువైతే… అన్న ప్రశ్న టీడీపీ మదిలో మెదులుతోంది. ఇన్ని భయాల మధ్య పులివెందులలో మహానాడు పెట్టేకన్నా… పక్కకు తప్పుకోడమే మంచిదన్న ఆలోచనకు వచ్చారట పార్టీ పెద్దలు. దీంతో… మహానాడు వేదిక కాస్త… పులివెందుల నుంచి కడపకు మారినట్టు సమాచారం.


Also Read : పెద్ద కొడుకు పుట్టినరోజే.. చిన్న కొడుక్కి ప్రమాదం.. పవన్ కల్యాణ్ కన్నీళ్లు


నిజానికి… ఈసారి మహానాడును కడపలోనే పెట్టాలని భావించారు. అయితే, ఆ తర్వాత పులివెందుల అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది కొందరు టీడీపీ నేతలకు. బాగానే ఉంటుందని అనిపించి దాదాపు పులివెందులలోనే మహానాడు జరిపించాలని దాదాపుగా ఫిక్సై పోయారు. కానీ… అన్నీ అంచనా వేసుకున్న తర్వాత.. వామ్మో..! పులివెందుల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం అనుకుని వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. సో… కడపలో మహానాడుకు ప్రిపేర్‌ అవుతోంది టీడీపీ. అయితే.. దీనిపై ఆ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి .. 

  1. AI అంటే అనుముల ఇంటెలిజెన్స్.. కవిత సంచలన వ్యాఖ్యలు

  2. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?

  5. ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Back to top button