
నల్లగొండ,క్రైమ్ మిర్రర్:- గ్రామస్థాయిలో కాంగ్రెస్ ను మరింత పటిష్టం చేయడానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలంతా కృషి చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని మనోరమ హోటల్లో యువజన కాంగ్రెస్ జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మరియు గ్రామపంచాయితీ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జక్కిడి శివ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో యువజన కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామ సర్పంచిగా గెలుపొందిన యువజన కాంగ్రెస్ నాయకులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నామినేటెడ్ పోస్టులలో యువజన కాంగ్రెస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.
Read also : Style=”color:red”
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా?
ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి & తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ కె.ఆర్.భవ్య,ఉపాధ్యక్షులు పొన్నం తరుణ్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు & నల్లగొండ జిల్లా ఇంచార్జులు దుబ్బాక చంద్రిక,పాలడుగు నాగార్జున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పెద్దగోని మౌనిక, రాష్ట్ర కార్యదర్శి కొర్ర గౌతమి,నల్లగొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మామిడి కార్తీక్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్బనబోయిన రామకృష్ణ, నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు మల్రెడ్డి భానుచందర్ రెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షుడు అజహరుద్దీన్, దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లాలోని అన్ని మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





