తెలంగాణ

కోదాడ మండలం దుర్గాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ, కానిస్టేబుల్ స్పాట్ డెడ్!

కోదాడ, క్రైమ్ మిర్రర్ న్యూస్ :-దుర్గాపురం బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీనీ కారు ఢీకొట్టడంతో ఎస్ఐ తో సహా ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ఆలమూరు స్టేషన్ ఎస్ఐ ఒక కేసు విషయంలో నలుగురు సిబ్బందితో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున దుర్గాపురం స్టేజి వద్ద ఆగి ఉన్న లారీ నీ వెనకనుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుచ్చు కవడంతో ఎస్ఐ అశోక్ కానిస్టేబుల్ స్వామి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దర సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకొని సంఘట స్థలానికి కోదాడ పోలీసులు క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గపు మధ్యలో పోలీసులు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

లక్షన్నర క్యూసెక్కుల వరద.. శ్రీశైలం డ్యాం గేట్లు ఓపెన్!

నా కొడుకు ఆమెను చంపుడు కరెక్టే.. ప్రియుడి తల్లి సంచలనం

Back to top button