
-
బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
-
మంత్రి పదవి వద్దని నేను అధిష్ఠానానికి చెప్పలేదు
-
హైకమాండ్ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా
-
ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలనేది అధిష్ఠానం నిర్ణయం
క్రైమ్ మిర్రర్, కరీంనగర్: బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం తాను ఏనాడూ పాకులాడలేదని స్పష్టం చేశారు. మంత్రి పదవి వద్దని తాను బీజేపీ హైకమాండ్‌కు చెప్పలేదని తెలిపారు. బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, సొంత నిర్ణయాలను నాయకత్వంపై రుద్దబోమని ఆయన వెల్లడించారు.
పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని, ఏ బాధ్యత అప్పగించినా నూరుశాతం ఎఫెర్ట్‌తో పనిచేస్తానని సంజయ్ అన్నారు. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని అన్నారు. 11ఏళ్లలో రైతుల కోసం రూ.71లక్షల కోట్లు ఎన్డీయే సర్కార్ ఖర్చు చేసిందన్నారు. టెన్త్ బాగా చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు తాను సొంతంగా స్కూటీలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాని అన్నారు బండి సంజయ్.
Read Also: