
తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మరోసారి స్పష్టమైంది. కాసుల కోసం ప్రభుత్వ భూములు, ప్లాట్లను వేలం వేస్తున్న రేవంత్ సర్కార్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. హెచ్ఎండీఏ ప్లాట్లను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడం అధికార వర్గాలను విస్మయపరుస్తోంది.
బాచుపల్లి ప్లాట్ల వేలంలో ఒక్క ప్లాటు కూడా అమ్ముడుపోలేదు. అత్యధికంగా గజం రూ.70,000 నిర్ణయించడంతో స్పందించని వినియోగదారులు. హైదరాబాద్–బాచుపల్లిలో తమ సంస్థకు చెందిన 70 ప్లాట్లు వేలం వేయగా, ఒక్కటి కూడా అమ్ముడుపోకపోవడంతో షాకయ్యారు హెచ్ఎండీఏ అధికారులు. గజం ధర రూ.70,000 నిర్ణయించడంతోనే ఎవరూ ఆసక్తి చూపలేదని పలువురు సిబ్బంది ఆరోపుస్తున్నారు.
మరోవైపు తుర్కయాంజల్ ప్రాంతంలో 12 ప్లాట్లు వేలం వేయగా, కేవలం 2 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. దీంతో తీవ్ర నిరాశలో హెచ్ఎండీఏ అధికారులు ఉన్నారు. అధిక ధరలే కారణమని కొందరు, ప్రభుత్వ సంస్థలపైన నమ్మకం కోల్పోవడమే కారణమని మరికొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.