
క్రైమ్ మిర్రర్, చౌటుప్పల్:- హైదరాబాద్- విజయవాడ ప్రధాన జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆంధ్రకు చెందిన ఇద్దరు డీఎప్సీలు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న లారీ.. ఏపీకి చెందిన పోలీసులు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న డీఎస్సీ చక్రధరరావు, శాంతారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఏపీకి చెందిన పోలీసు అధికారులు విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన విషయం తెలుసుకున్న ఏసీపీ పట్టొళ్ల మధుసూదన్ రెడ్డి సంఘటన స్థలికి చేరుకుని ప్రమాద విషయాన్ని సమీక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు మృతదేహాలను చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సినిమాల్లో మునిగిపోయి.. పర్సనల్ లైఫ్ కోల్పోయా : విజయ్ దేవరకొండ
తిరుపతి జూపార్క్ రోడ్ లో బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి!