తెలంగాణ

తెలంగాణలో వర్షాలు.. ఎక్కడెక్కడ కురుస్తాయంటే?

Rains In Telangana: రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి కనిపిస్తోంది. ఓ వైపు ఎండలు మండుతుండగా, మరోవైపు వానలు పడుతున్నాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వానలు కురిశాయి.

అల్పపీడనం.. వాయుగుండంగా..

ఈ వానాకాలం సీజన్ లో అత్యధికంగా ఆదిలాబాద్ జైనథ్ లో 13.77 సెంటీ మీటర్లు, తాంసిలో 13.53 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదలయ్యింది. రానున్న రెండు మూడు రోజుల పాటు తెలంగాణలతో పాటు, ఏపీ, ఒడిశా, బెంగాల్ లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అటు అల్పపీడనం, వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు. ఓ మోస్తారు వర్షాలతో పాటు 30 నుంచి 40 కిలో మీటర్ల చొప్పున గాలులు వీస్తాయని తెలిపారు.

ఏ జిల్లాల్లో వానలు కురుస్తాయంటే?

రుతుపవనాలకు తోడు వాయుగుండం కారణంగా..  శుక్రవారం నాడు ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణశాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌, సిద్దిపేట, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది.

Read Also: లక్షన్నర క్యూసెక్కుల వరద.. శ్రీశైలం డ్యాం గేట్లు ఓపెన్!

Back to top button