
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఎంత ఘనంగా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోని ప్రజలందరూ కూడా చాలా చక్కగా, కుటుంబ సమేతంగా బతుకమ్మ పండుగను చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఏడాది బతుకమ్మ పండుగ మొదలైన రోజే విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మ ఆడుతున్న సమయంలో… డీజే సౌండ్ కారణంగా గుండెపోటుకు గురై ఏకంగా ఇద్దరు మహిళలు మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనలు వైరల్ అయ్యాయి. దీంతో చాలామంది కూడా షాక్ కు గురవుతున్నారు.
Read also : కేంద్రం ఆదేశాలను పాటించరా… ధరలను ఎందుకు తగ్గించలేదు?
ఇక అసలు వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా, ఎంచగూడెంకు చెందిన మౌనిక అనే 32 ఏళ్ల మహిళా ఈనెల 21వ తేదీన ఎంగిలిపూల బతుకమ్మ ఆడేందుకు ఎంతో ఆనందంగా వెళ్ళింది. కానీ అవే చివరి క్షణాలు అవుతాయని ఆమెకు తెలియలేదు. ఎంగిలిపూల బతుకమ్మ ఆడుతున్న సమయంలో… DJ సౌండ్ కారణంగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్ప కూలింది. వెంటనే పక్కనున్నటువంటి వ్యక్తులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ఆ మహిళ మరణించింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా, మాచిరెడ్డిపల్లిలో మేఘన అనే 24 ఏళ్ల యువ మహిళా బతుకమ్మ ఆడుతూ గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. ఈమెను కూడా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషాదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పండుగ మొదలైన రోజే ఇద్దరూ గుండెపోటు కారణంగా మృతి చెందడంతో తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై అప్రమత్తమవుతున్న అధికారులు డీజే ను పరిమితమైన సౌండ్ తోనే ఉపయోగించాలని… లేదా అసలు డీజే ను బతుకమ్మ ఆడుతున్న సమయంలో ఉపయోగించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పండుగ రోజు ఇద్దరూ మృతి చెందడంతో వాళ్ల కుటుంబంతో పాటుగా గ్రామం అంతా కూడా విషాదంలో ఉండిపోయింది.
Read also : ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్… ఏపీలో రెచ్చిపోతున్న వర్షాలు!