
రామకృష్ణాపూర్, క్రైమ్ మిర్రర్:- రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జె.శ్రీధర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జైపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఆయనను ఇటీవల పోలీస్ శాఖ ఉత్తర్వుల మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖతో సహకరించి, సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.





