క్రైమ్రాజకీయం

ఇంకోసారి మీటింగ్ పెడితే బాంబు పెడతా అంటూ విజయ్ కు బెదిరింపులు?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- సినీనటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. డయల్ 100 కు కాల్ చేసి విజయ్ ఇంకోసారి పబ్లిక్ లో మీటింగ్ నిర్వహిస్తే ఖచ్చితంగా ఆయన ఇంట్లో బాంబు పెట్టి చంపేస్తామంటూ హెచ్చరించినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చెన్నైలోని నివాసం ఉంటున్న విజయ్ ఇంటికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఇంటి చుట్టూ కూడా బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కాగా బాంబు బెదిరింపులు చేసిన వ్యక్తి ఎవరు అని పోలీసులు ఆ నెంబర్ ను ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయినా కానీ ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. అయితే ఈ మధ్య కరూర్ లో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. విజయ్ పాల్గొన్న ఈ సభలో తొక్కిసలాట జరగగా దాదాపు 41 మంది మరణించడం జరిగింది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ మండిపడ్డాయి.

విజయ్ పై ఒకవైపు అధికార పార్టీ నాయకులు మరోవైపు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో విజయ్ ఈసారి జరగబోయే ఎలక్షన్లలో కచ్చితంగా గెలిచి ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ ఈ సంఘటన తర్వాత ప్రతి ఒక్కరు కూడా విజయ్ గెలుపు డౌటే అని అంటున్నారు. అలాగే ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకున్న నేను సిద్ధమేనంటూ విజయ్ స్పష్టం చేశారు.

Read also : కబడ్డీలో తెలుగు జట్టు దూసుకుపోతుంది… వరుసగా 5 విజయాలతో రికార్డు!

Read also : పిడుగుపాటుకు పాడి గేదే మృతి

Back to top button