క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: తీసుకున్న అప్పునకు వడ్డీ చెల్లించడం లేదని వ్యాపారి దాడికి పాల్పడిన ఘటన తాండూరులో కలకలం చేస్తుంది. ఆటో డ్రైవర్ బాలయ్య డబ్బులు ఇవ్వలేదని మ్యాదరి రవి అనే వ్యక్తి ఎంతో క్రూరంగా తనదైన స్టైల్ చూపిస్తూ చేతులతో, కట్టేతో కొడుతూ తానే సొంతంగా వీడియో తీయించి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంఘటన తాండూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డబ్బులు ఇవ్వలేదంటూ ఆ ప్రబుద్ధుడు తాను తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త తీవ్ర వైరల్‌గా మారింది. కేవలం డబ్బులు ఇవ్వలేదని ఓ నిరుపేద అమాయకుడైన ఆటో డ్రైవర్‌పై దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తూ.. నిందితుడిపై కఠినమైన చర్యలు చేసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..!
వడ్డీ వ్యాపార వద్ద తీసుకున్న రూ.5 వేల రూపాయలకు నెలకు రూ.500 వడ్డీ కావడంతో మూడు నెలలకు రూ.6,500 అయ్యిందని వివరించారు. దీంతో ఆవేశానికి లోనైనా వడ్డీ వ్యాపారి సినిమాను తలపించేలా కుటుంబ సభ్యులతో వీడియో తీయిస్తూ వడ్డీ అసలు డబ్బులు చెల్లించలేదని ఆటో డ్రైవర్ బాలయ్యపై పిడుగులు గుద్దాడు. సినిమా సన్నివేశంలో మాదిరిగా వడ్డీ వ్యాపారి మ్యాతరి రవి ఆటో డ్రైవర్ బాలయ్యపై దాడి చేసిన వీడియో వైరల్ అయింది. చేతులు వెనక్కి కట్టి తన్నడమే కాకుండా పిడిగుద్దులు గుద్దాడు. పైగా కుటుంబ సభ్యులతో వీడియో తీయించాడు. ఇట్టి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను విరిచారించక అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు చెప్తున్నారు. వడ్డీ వ్యాపారి వద్ద తీసుకున్న రూ. 5 వేల రూపాయలతో పాటు వడ్డీ చెల్లించలేదంటూ ఆటో డ్రైవర్‌పై దాడికి పాల్పడిన ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
వడ్డీ వ్యాపారి పై కేసు నమోదు..!
తాండూరు పట్టణం రాజీవ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలయ్య తన అవసరాల కోసం పట్టణం గాంధీనగర్‌కు చెందిన మ్యాదరి రవి అనే వ్యక్తి వద్ద నుంచి మూడు నెలల క్రితం రూ.5వేల రూపాయల అప్పు తీసుకున్నాడని చెప్పారు. ఇట్టి డబ్బులతో పాటు వడ్డీ చెల్లించలేదని ఆటో డ్రైవర్ బాలయ్యపై దాడికి పాల్పడిన వ్యక్తిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసామని పట్టణ సీఐ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.