
largest city India: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా ఎదగడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న చారిత్రక నిర్ణయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని భారీగా విస్తరించేందుకు మార్గం సుగమమైంది. ఈ విస్తరణలో భాగంగా GHMC పరిసరాల్లోని 27 మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను పూర్తిగా విలీనం చేస్తారు. ఈ విలీనం పూర్తయితే, హైదరాబాద్ మొత్తం 2,735 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా అవతరించనుంది.
ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల ప్రతిస్పందన కూడా పాజిటివ్‌గానే ఉంది. GHMCలో విలీనం ద్వారా మెరుగైన పౌర సేవలు, వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ అభివృద్ధి మరింత ప్రభావవంతంగా జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విస్తరణ మాత్రమే కాకుండా, నగర పరిపాలన, మౌలిక సదుపాయాల ప్రణాళిక, అభివృద్ధి లక్ష్యాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఇది కీ రోలును పోషిస్తుంది.
హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించడం, తెలంగాణ ప్రభుత్వ పట్టణాభివృద్ధిపై ఉన్న దృష్టిని స్పష్టంగా చూపుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది నగర భవిష్యత్తు ప్రణాళికలకు, మౌలిక సదుపాయాల సమగ్ర వికాసానికి, పరిపాలనలో సమన్వయాన్ని సాధించడానికి మైలురాయి స్థాయిని అందించనుంది. అత్యంత విస్తృతమైన మెట్రోపాలిటన్ నగరంగా హైదరాబాద్ రాబోయే దశాబ్దాల్లో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో కీలక కేంద్రంగా నిలిచే అవకాశం ఉంది.
ALSO READ: బంగారుగడ్డ పత్తి మిల్లులో దళారులదే హవా?





