తెలంగాణ

దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశ ప్రజల గుండెల్లో గాయమైందని.. తమకు దైవ సమానమైన అంబేద్కర్‌ గురించి అమిత్ షా చులకనగా మాట్లాడారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై పార్లమెంట్‌లో కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం నాడు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరబాద్ కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ… రాజ్యాంగంపై నమ్మకమున్న ప్రతి పౌరునికి అమిత్ షా మాటలు బాధ పెట్టాయన్నారు.

Also Read : జై పాలస్తీనా.. మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు

అమిత్ షా‌ను సపోర్ట్ చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఖరి కూడా ప్రజలకు అర్థమైందన్నారు. రాష్ట్రపతి తలుపు కూడా తడతామన్నారు. అమిత్ షా మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తున్నామని టీపీసీసీ చీఫ్ అన్నారు. రాజ్యాంగాన్ని కించపరిచే లాగా అమిత్ షా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని తీసేసి మనుస్మృతి అమలులోకి తేవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి మెమొరాండం ఇచ్చామన్నారు. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని టీపీసీచీఫ్ మహేష్ గౌడ్ వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. ప్రభుత్వం విఫలమై… అల్లు అర్జున్ ను హైలెట్ చేస్తున్నారు?
  2. విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ… 10 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు
  3. అయోధ్యలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు?
  4. కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో ఊరట.. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ
  5. కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేటీఆర్?

Back to top button