క్రీడలువైరల్

నెరిసిన గడ్డంతో విరాట్ కోహ్లీ పిక్చర్!.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?

క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీమిండియా కు ఎన్నో విజయాలను అందించడంలో ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం టెస్టులు మరియు T20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లండన్ లోనే స్థిరపడి ఉంటున్నారు. అయితే తాజాగా ఒక వ్యక్తితో విరాట్ కోహ్లీ ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఈ పిక్చర్ లో విరాట్ కోహ్లీ పూర్తిగా నెరిసిన గడ్డంతో ఉన్నారు. ఈ నెరిసిన గడ్డాన్ని చూసిన కోహ్లీ అభిమానులు షాకు కు గురయ్యారు. మునుపెప్పుడు కూడా విరాట్ కోహ్లీని ఇలాంటి వైట్ గడ్డంతో చూడలేదు అని అభిమానులు సోషల్ మీడియా వేదిక కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది విరాట్ కోహ్లీ అభిమానులు ఏకంగా ఈ లుక్ లో చూడలేకపోతున్నామని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.

Read also : తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రులు!

సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా కోహ్లీ ఏంటి 50 ఏళ్లు దాటిన వ్యక్తి లా కనిపిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. కాగా గతంలో విరాట్ కోహ్లీ ఎంత చక్కగా.. చూడడానికి చాలా బాగుండేవాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీలో చాలానే మార్పులు వస్తున్నాయని అందరూ భావిస్తున్నారు. కోహ్లీ వింటేజ్ లుక్ లోనే చూడాలి అని చాలామంది అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. కాగా విరాట్ కోహ్లీ ఇప్పటికీ కూడా మిగతా క్రికెట్ ప్లేయర్స్ కంటే కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. 40 ఏళ్లు వచ్చినా కూడా విరాట్ కోహ్లీ ఫిట్నెస్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు అని కోహ్లీ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం ఇప్పటికి కూడా చాలా మందికి ఇష్టం లేదు. కానీ ఓడీలకు త్వరలోనే తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. కాబట్టి అందరూ కోహ్లీ ఎప్పుడు ఆడతాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also : నేటి ముఖ్యాంశాలు… మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button