
-
హయత్‌నగర్-మునగనూరు రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం
-
తుర్కయంజాల్‌లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి హయత్‌నగర్-మునగనూరు రోడ్డులో భారీ వృక్షం నేలకూలింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్టు నేలకూలిన సమయంలో అటువైపు వాహనాలేవీ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భారీ వృక్షం నేలకూలడంతో కరెంట్ సరఫరాకు అటంకం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది హుటాహుటిన చెట్టును తొలగించారు.
Read Also: