
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పలువురి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం రోజున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కొత్తగా పెళ్లయిన ప్రతి అర్హత కలిగిన మహిళకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని,ఈ పథకం వల్ల వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని అన్నారు.
Read also : ఉమెన్స్ ఐపీఎల్ లో RCB రికార్డు..?
Read also : Trump Letter: నాకే నోబెల్ ఇవ్వరా? ఇక శాంతి గురించి ఆలోచించేది లేదన్న ట్రంప్!





