తెలంగాణ

దమ్ముంటే చర్చకు రారా రేవంత్.. తొడగొట్టిన కేటీఆర్

ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ప్రతి సవాల్ విసిరారు. ఈనెల 8వ తేదీన ఉదయం 11గంలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రేవంత్ రెడ్డితో చర్చకు సిద్దమన్నారు కేటీఆర్. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిదామని రేవంత్ కు సవాల్ చేశారు. 72 గంటలు సమయం ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రావాలన్నారు కేటీఆర్. రైతు సమస్యలపై చింతమడకు, కొండారెడ్డిపల్లె అయినా సరే.. రేవంత్ రెడ్డితో చర్చకు రెడీ అన్నారు. నిజం ఒప్పుకోని వాడిని.. నటించే వాడిని రేవంత్ రెడ్డి అంటారన్నవారు.

పేటీఎం మాదిరి.. పే సీఎంగా రేవంత్ రెడ్డి పేరు సంపాదించారని కేటీఆర్ అన్నారు. రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎగ్గొడుతుందన్నారు. అన్నదాతకు సున్నం పెట్టిందే.. కాంగ్రెస్ ప్రభుత్వం.. చంద్రబాబు జలదోపిడికి వంత పాడుతోంది ఎవరో తెలియదా?..చంద్రబాబు అస్సలు కోవర్టు రేవంత్ రెడ్డే.. ప్రజాపాలన కాదు.. తెలంగాణలో చంద్రబాబు కోవర్టు పాలన సాగుతుందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అభినందిస్తున్నానని చెప్పారు.

కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్ లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలన్నారు. నాలుగు వేల పెన్షన్, 2,500 కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
స్థానిక సంస్థల్లో సీఎం సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలవదని ఛాలెంజ్ చేశారు. వందనా.. వాళ్ళ‌ బొందనా? వంద సీట్లు కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని నిలదీశారు. వంద గెలవాలంటే.. ముందు ప్రజలు ఓట్లు చేయాలి కదా.. రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ మాత్రమే తెలంగాణలో జోరు మీదుందని చెప్పారు.

గుడ్డలు ఊడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని రేవంత్ చెప్పటం సిగ్గుచేటని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ కు బేసిన్ తెలియదు.‌. బెండకాయ తెలియదు.. ఎరువులు ఇవ్వటం చేతకాని వాడికి కేసీఆర్ తో చర్చ ఎందుకు?ఏ రైతు, ఏ ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆర్ అని చెప్తారని అన్నారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మత్స్య సంపదను సృష్టించిందే కేసీఆర్..హారతులు పట్టి ఆంధ్రకు నీటిని పంపిందే కాంగ్రెస్ నేతలు అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై పోరాటానికి బీఆర్ఎస్ రెడీగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button