ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో సజావుగా ఎమ్మెల్సీ ఎన్నికలు- ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్‌… సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 4 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఏపీ రెండు గ్రాడ్యుయేట్‌, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ జరుగుతుండగా… తెలంగాణలో రెండు టీచర్‌, ఒక గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్‌ : –  కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో… ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ ఓటు వేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌. కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి గట్టి పోటీ ఉంది. టీడీపీ-పీడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ నుంచి ఆళ్లపాటి రాజా బరిలో ఉండగా… పీడీఎఫ్‌ నుంచి కేఎస్‌ లక్ష్మణ్‌రావు పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో 3లక్షల 46 వేల 529 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉన్నారు. రసవత్తరమైన పోటీ ఉండటంతో… గెలుపు ఎవరిదో ఓటర్లు తేల్చబోతున్నారు. ఓటు వేసిన తర్వాత… చంద్రబాబుతో మాట్లాడారు టీడీపీ అభ్యర్థి ఆళ్లపాటి రాజా. ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత… ఓటు వేసేందుకు వచ్చిన వారిని పలకరించారు.

https://youtu.be/nNcKTPV2iXo?si=v8sjHOT3NXBw9R3s

ఇక… తెలంగాణలో మెదక్‌-కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, టీచర్‌ ఎమ్మెల్సీతోపాటు… వరంగల్‌-నల్గొండ, ఖమ్మం జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్‌ జరగనుంది.

  1. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు

  2. అన్నమయ్య జిల్లా గుండాలకోనలో ఏనుగుల బీభత్సం – ముగ్గురు మృతి

  3. జగన్‌.. ఇదేనా మీ సాంప్రదాయం- వైసీపీ తీరుపై ఏపీ స్పీకర్‌ ఫైర్‌

  4. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అంటున్న ముఖ్యమంత్రులు!… క్రైమ్ మిర్రర్ ప్రత్యేక కథనం… ప్రజల కోసం?

  5. జగన్, రోజాలా బూతులొద్దు.. ఎమ్మెల్యేలకు పవన్ హితవు

Back to top button